రాంబాబు టాక్ : గబ్బర్ సింగ్ రేంజిలో లేదా?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. సినిమా టాక్ విషయానికొస్తే......సినిమా జస్ట్ ఎబో యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఎంటర్ టైన్మెంట్ విషయంలో 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బీట్ చేస్తుందని ఊహించిన వారి అంచనాలు తలక్రిందులు అయ్యాయి. సినిమా ఆరేంజిలో లేదని, అయితే కాన్సెప్టు, స్టోరీ మాత్రం బాగుందని అంటున్నారు.
సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై సెటైరిక్ గా బాగుందని.....అయితే పూరి స్ర్కీన్ ప్లే సినిమాకు కాస్త మైనస్ అయిందని, అందుకే గబ్బర్ సింగ్, బద్రి సినిమాల రేంజిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్ట్సార్డినరీ, పవన్ కళ్యాణ్ తన పవన్ ఫుల్ డైలాగులు, డాన్సులు, కామెడీ టైమింగుతో దుమ్మురేపాడని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు.
పవర్ స్టార్, ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు, డైలాగులు సినిమాకు హైలెట్ గా మారాయి. ఇదే హైప్ మరింత పెంచి ఉంటే సినిమా దుమ్మురేపేదని, పూరి తన స్క్రీన్ ప్లేతో అంతా చెడగొట్టాడని అంటున్నారు. సినిమాలో కొన్ని అనవసర సీన్లు ఉండటం కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోవడానికి కారణం అంటున్నారు.
ప్రకాష్‌రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











