చిరు కోసమే ఆలస్యం! రాంబాబు ఆడియో డేట్ ఖరారు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఫైనల్ గా సెప్టెంబర్ 24న ఖరారు చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తొలుత సెప్టెంబర్ 21 న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నప్పటికీ చిరంజీవి డేట్స్ కుదరక పోవడంతో ఆయన రాకకు వీలుగా 24న ఫైనల్ చేసారని తెలుస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్ మార్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన మణి శర్మ...ఈ చిత్రానికి పూరి టేస్టుకు తగిన విధంగా మాంచి మాస్ బీట్స్ తో సాంగ్స్ కంపోజ్ చేసారు. ఇటు పవన్ కళ్యాణ్ స్టైల్‌కు సరిపోయే విధంగా, అటు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌కు అద్దం పట్టేలా ఆయన మ్యూజిక్ ఉంటుందని అంటున్నారు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాన్‌కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్. అక్టోబర్ 11న చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











