పవన్ మూవీ.... పూరి-దానయ్య మనీ మ్యాటర్ సెటిల్డ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత డివివి దానయ్య మధ్య డబ్బుల విషయంలో తగాదా ఏర్పడిన విషయం తెలిసిందే. నిర్మాత తనకు ఇవ్వాల్సిన రూ. 4.5 కోట్లు ఎగ్గొట్టారని దర్శకుడు పూరి ఫిర్యాదు కూడా చేసారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం సాగుతుందని, ఆ కారణంగానే ఆడియో వేడుక కూడా నిర్వహించ లేదని స్పష్టం అవుతోంది.
అయితే ఎట్టకేలకు ఈ వివాదం ఓ కొల్లిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న పూరి జగన్నాథ్ బర్త్ డేను పురస్కరించుకుని సాయంత్రం ఏర్పాటు చేసిన పార్టీకి నిర్మాత డీవీవీ దానయ్య హాజరయ్యారని, దాదాపు ఇద్దరి మధ్య 5 గంటలపాటు చర్చలు జరిగాయని సమాచారం. పూరి రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా ప్రాఫిట్లో షేర్ ఇస్తానని నిర్మాత కన్విన్స్ చేయడంతో పూరి శాంతించినట్లు సమాచారం. వివాదం ఓ కొలిక్కి రావడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్‌రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











