‘రాంబాబు’ ప్రీమియర్ షో... మెగా హిట్ టాక్!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రీమియర్ షో మంగళవారం ప్రసాద్ లాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ షోకి పూరి జగన్నాథ్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, సినిమాలో నటించిన పలువురు నటులు, టెక్నీషియన్స్, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా అభిమానుల అంచనాలను మించి ఉందని, పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయం అంటున్నారు యూనిట్ సభ్యులు.

మరో వైపు ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్ కోసం అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. 18న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో 17వ తేదీ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు పలు చోట్లు భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు. కేవలం బెనిపిట్ షోల ద్వారానే రాష్ట్ర వాప్తంగా రూ. 2 కోట్ల పై చిలుకు వసూలు అవుతున్నట్లు అంచనా.

ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.

ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X