‘కెమెరామెన్ గంగతో...’ ప్రోమోసాంగ్స్ ఔట్ డేటెడ్!
పరవ్ స్టార్స్ పవన్ కళ్యాణ్ తాజాగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ప్రోమో సాంగ్స్ విడుదలయ్యాయి. ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సాంగ్స్ యూట్యూబ్ లో విడుదలై హల్ చల్ చేస్తున్నారు. 'రాంబాబు' ధీమ్ సాంగుతో పాటు మిగిలిన పాటలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇవి పాత చింతకాయ పచ్చడిలా ఔట్ డేటెడ్ గా ఉన్నాయంటున్నారు. అయితే సాంగ్స్ ఇప్పుడు అలానే అనిపించినా వినగా వినగా బాగుంటాయని మరికొందరంటున్నారు.
సాంగ్స్ వివరాలు...
1. రాంబాబు థీమ్ సాంగ్...
2. నీ నగు మోమే ఎక్స్ ట్రార్డనరీ...నీ సిగ తరగా ఎక్స్ ట్రార్డనరీ...
3. మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో...
ఇక ఆడియోలోని మొత్తం సాంగులు ఈ నెల 24న నేరుగా వెబ్ తో పాటు, మార్కెట్లోకి నేరుగా విడుదల కానున్నాయి. పంజా, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకల సందర్భంగా భారీగా అభిమానులు తరలి రావడంతో చోటు సరిపోక చాలా మంది బయటే ఉండి పోయారు. క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌తో అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకూడదని, తన వల్ల, తన సినిమా వల్ల ఇంత మంది ఇబ్బంది పడటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు నో చెప్పినట్లు తెలస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











