పవన్ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' రిలీజ్ డేట్
'కెమెరామేన్ గంగతో రాంబాబు' ప్రారంభంలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించి పూరీ జగన్నాధ్ తన సత్తాను మరో సారి చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రానికి సమర్పించే ఈ చిత్రాన్ని అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పూరీ చెప్పారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది.
పూరీ ఈ విషయమై మాట్లాడుతూ... 'బద్రి' సినిమాతో నాకు లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారితో మరో సినిమా చేయాలని చాలా సార్లు ప్లాన్ చేశాం. కానీ ఎందుకో మా కాంబినేషన్ అలా అలా డిలే అయి ఇప్పటికి కుదిరింది. దర్శకునిగా నాకు 25వ చిత్రం. ఇది ఓ న్యూస్ రిపోర్టర్ కథ. పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉండే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఇది. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం' అన్నారు.
నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలన్న కోరిక ఇన్నేళ్లకు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 'దేశముదురు' చిత్రం తరువాత పూరి జగన్నాథ్ గారితో మళ్లీ సినిమా చేస్తున్నాం. మా బ్యానరులో ఇది ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది' అన్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటించే ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











