అనూష్క లవ్ స్టోరీ సక్సెస్
అనూష్క మధ్యవర్తిగా ఉండి సెట్ చేసిన ప్రేమ వ్యవహారం పెళ్ళి వరకూ వచ్చి సక్సెస్ అయింది. ప్రముఖ కెమెరా మెన్ సెంధిల్ కీ అనూష్క స్నేహితురాలు రూహీ కి వివాహం జూన్ 26 న సికింద్రాబాద్ లో జరగనుంది. ఐతే, సై, యమదొంగ, అరుంధతి, మగధీర వంటి చిత్రాలకు పనిచేసిన సెంధిల్ గత కొంతకాలంగా ఆమెతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రేమ అరుంధతి షూటింగ్ సమయంలో మొదలైందని సమచారం. అయితే ఈ ప్రేమకు మొదట ఓటు వేసిన అనూష్క ఇద్దరి మధ్యా వారధిలా పనిచేసేది. దాంతో అందరికీ సెంధిల్ కీ అనూష్కకీ మధ్య ఏదో జరుగుతోందని డౌట్ వచ్చి రూమర్ బయిలుదేరింది. చివరకు అసలు విషయం బయిటపడ్డాక అంతా నాలుక్కరుచుకున్నారు. ఇక ఇరు వైపు పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం జరుగుతున్నట్లు సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే చాలా మంది అనూష్కకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెపుతున్నారని తెలుస్తోంది. ఇది మరీ కామెడీగా ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











