»   » నవలలో బోల్డ్ కంటెంట్, అందుకే మూవీలో నగ్న దృశ్యాలు (ఫోటోస్)

నవలలో బోల్డ్ కంటెంట్, అందుకే మూవీలో నగ్న దృశ్యాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''అందరూ ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్‌ ఫిల్మ్‌ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం'' అని దర్శకుడు ప్రభాకర్‌ జైని అన్నారు.

'అమ్మా నీకు వందనం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్‌ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'క్యాంపస్‌-అంపశయ్య'. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన 'అంపశయ్య' నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. ప్రభాకర్‌ జైని, విజయలక్ష్మి జైని ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రత్యేక పాత్రలో ఆకెళ్ల రాఘవేంద్ర నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో..

చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైని మాట్లాడుతూ

చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైని మాట్లాడుతూ

‘నవలలో బోల్డ్‌ కంటెంట్‌ ఉంది. ఆ కంటెంట్‌ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది' అని దర్శకుడు తెలిపారు.

కథానుగుణంగా

కథానుగుణంగా

కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. పాత్రధారుల భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి అన్నారు దర్శకుడు.

కమర్షియల్ ఉద్దేశ్యం లేదు

కమర్షియల్ ఉద్దేశ్యం లేదు

సినిమాలో ఇలాంటి పెట్టడం వెనక వ్యాపారాత్మక దృక్పథంతో, కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసే ఉద్దేశం లేదు అని దర్శకుడు స్పష్టం చేసారు.

తెలంగాణ గ్రామీణ జీవితం

తెలంగాణ గ్రామీణ జీవితం

సాధ్యమైనంత వరకూ 1965-70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమన్నారు దర్శకుడు.

ప్రశంసలు

ప్రశంసలు

ఇటీవల చిత్రం చూసిన పలువురు సినీ ప్రముఖులు మంచి ప్రయత్నమంటూ ప్రశంసించడం సంతోషాన్నిచ్చిందన్నారు.

రిలీజ్

రిలీజ్

ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని దర్శకుడు తెలిపారు.

నటీనటులు

నటీనటులు

శ్యామ్ కుమార్, పావని, మోనికా థాంప్సన్, శరత్, యోగి, దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతీ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్‌ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.

English summary
Campus Ampasayya release on 30 July. The Directed by Prabhakar Jaini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu