జూ ఎన్టీఆర్ ‘దమ్ము’కు అంత దమ్ముందా?
ఈ మధ్య తెలుగు సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు రికార్డుల విషయంలో ఆసక్తి బాగా పెరిగి పోయింది. తాజాగా జూ ఎన్టీఆర్ 'దమ్ము' విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈచిత్రం రికార్డులు సృష్టిస్తుందా? అనే చర్చ మొదలైంది. తాజాగా అందరూ ఈచిత్రం ఫస్ట్ డే రికార్డు గురించి మాట్లాడుకుంటున్నారు.
'దమ్ము' చిత్రం ఫస్ట్ డే రికార్డులు బద్దలు కొడుతుందా? ఈచిత్రానికి అంత దమ్ముందా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు విషయంలో మెగా పవర్ స్టార్ నటించిన 'రచ్చ' చిత్రం ముందుంది. గతంలో మహేష్ బాబు నటించిన 'బిజినెస్‌మేన్' చిత్రం తొలిరోజు 7 కోట్ల పై చిలుకు షేర్ సాధించి మొదటి స్థానంలో ఉండేది. అదే విధంగా తొలి రోజు వారం కలెక్షన్ల దాదాపుగా 28 కోట్లకు పై చిలుగా నమోదయ్యాయి.
ఇటీవల విడుదలైన 'రచ్చ' చిత్రం తొలి రోజు 8.5 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించి బిజినెస్‌మేన్ రికార్డును తుడిచిపెట్టిందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అదేవిధంగా తొలివారం రికార్డుల విషయంలో కూడా 30 కోట్ల పైచిలుకుతో టాప్ లో ఉంది.
మరి తాజాగా విడుదలైన 'దమ్ము' ఈ రికార్డులను బద్దలు కొడుతుందా? అనే విషయమై ప్రేక్షకుల్లో ముఖ్యంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 1200 చిలుకు థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో తప్పకుండా రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి 'దమ్ము' దమ్మేంటే త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











