పవన్ ఇచ్చే సర్ప్రైజ్ ఏమిటీ???: బర్త్‌డే నాడే సర్ప్రైజ్ అంటూ ప్రచారం
సోషల్ మీడియాలో పవన్ పుట్టిన రోజుకు ఓ సర్ప్రైజ్ ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. కొందరు పీఆర్వోలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.
Recommended Video

ఈ సెప్టెంబర్ 2న పవన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న 25వ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల కిందట గ్రాండ్ గా ప్రకటించింది. అలా ఎనౌన్స్ చేసిన కొన్ని గంటలకే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ పోస్ట్ ను తొలగించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఉందీ అంటూ అభిమానులను ఊరిస్తున్నారు.

మూవీ ఫస్ట్ లుక్
ఫస్ట్‌లుక్ ఉంటుందని చెప్పి మళ్ళీ ఆగిపోయిందీ అనటం తో అంతా అయోమయానికి గురైనా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ పోస్ట్ తీసేశారని అంతా అనుకున్నారు. కానీ పవన్ పుట్టినరోజు నాడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇష్టంలేకనే పోస్ట్ తొలిగించారని కొన్ని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఒక్క అఫీషియల్ అప్ డేట్ కూడా రాలేదు.

ఫస్ట్ లుక్ రిలీజ్ వాయిదా
అయితే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. చిత్ర నిర్మాతలు కూడా ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ తరువాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. దీంతో ఫస్ట్ లుక్ రిలీజ్ వాయిదా పడిందన్న టాక్ రావటం తో చాలా రోజులుగా సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరుత్సాహపడ్డారు.

సర్ప్రైజ్ ఉంటుందంటూ ప్రచారం
కానీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పవన్ పుట్టిన రోజుకు ఓ సర్ప్రైజ్ ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. కొందరు పీఆర్వోలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. మరి ఈ శనివారం ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరం. ఫస్ట్ లుక్కే అయితే ముందే తెలిసిన సమాచారమే కాబట్టి మళ్లీ సర్ప్రైజ్ అనాల్సిన అవసరం లేదు కదా.

టీజరే వచ్చేస్తుందా ?
అంటే ఏకంగా టీజరే వచ్చేస్తుందా అన్న ఆశలు కూడా లేకపోలేదు అభిమానుల్లో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మిత్రుడు ఎస్.రాధాకృష్ణ నిర్మాత. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాతోనే తెలుగులో అడుగుపెడుతున్నాడు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











