పవన్ పవర్ సరిపోవట్లేదంటూ..డోస్ పెంచమంటున్నా మెగా ఫ్యాన్స్..
పాజిటివ్ రివ్యూలొచ్చాక, పవన్ సినిమా ఎలా ఉంటుంది?ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాస్తుంది..పవర్ స్టార్ స్టామినా అలాంటిది మరి. కానీ, 'తీన్ మార్" విషయంలో పవన్ కళ్యాణ్ కి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కానే కాదు. ఎప్పుడూ రికార్డుల గురించీ సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించీ పవన్ ఆలోచించకపోయినా, పవన్ అభిమానులకు మాత్రం'తీన్ మార్" సినిమా రిజల్ట్ అస్సలు మింగుడుపడ్డంలేదు. ఇలా జరిగిందేమిటి? అంటూ పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
తీన్ మార్"ని మర్చిపోదామనుకుంటున్నా, ఇప్పట్లో చరణ్ సినిమా వచ్చే అవకాశఆల్లేవు కాబట్టి..పవన్ కొత్త సినిమా'షాడో"(వర్కింగ్ టైటిల్ మాత్రమే)సినిమాపైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు విష్ణువర్థన్ స్టైలిష్ సినిమాలు మాత్రమే తీస్తాడు కాబట్టి, మాస్ మసాలా అంశాలు పెద్దగా వుండవు కాబట్టి, 'తీన్ మార్"లా 'షాడో" కూడా అటకెక్కిపోతుందేమోనన్న అనుమానాలు మెగాభిమానుల్ని వెంటాడుతున్నాయి.
'తీన్ మార్" దెబ్బతో పవన్ గనుక జాగ్రత్త పడి, మాస్ కి చేరువయ్యే అంశాల్ని సినిమాల్లో జొప్పంచాలన్న సూచన విష్ణువర్థన్ కి చేయాలనేది మెగాభిమానుల కోరిక. ఏదిఏమైనా, 'ఖుషీ" తర్వాత ఇప్పటిదాకా(జల్సాతో హిట్ కొట్టినా పవన్ 'పవర్"అభిమానలుకు సరిపోవట్లేదు మరి..కొంత డోస్ పెంచి)పవన్ నుంచి పవర్ ఫుల్ సినిమాని ఆశిస్తోన్న మెగాభిమానులకి పవన్ 'షాడో"తో సంబరాలు చేసుకునే అవకాశమిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











