హ్యాట్రిక్ హిట్స్ తో జూ ఎన్టీఆర్, బన్నీలకు గట్టిపోటీ ఇస్తున్న‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’
'ఛత్రపతి" తర్వాత కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలని చవిచూసిన ప్రభాస్ కెరీర్ మళ్లీ గాడిన పడింది. 'డార్లింగ్"తో సైలెంట్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈసారి ఫ్యామిలీ మూవీతోనే తన కెరీర్ లో పెద్ద హిట్ కొట్టాడు. 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" సినిమా సూపర్ కలెక్షన్స్ తో ఈ ఏడాదిలో విడుదలైన తెలుగు చిత్రాల్లో నంవర్ వన్ స్థానాన్ని చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజా చిత్రం రెబల్ షూటింగ్ స్టార్ట్ అయింది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న అభిమానులు కోరుకునే మాస్ సినిమా చేసి చాలా కాలమైన ప్రభాస్ ఆ లోటుని ఈ సినిమాతో తీర్చేయనున్నాడు. 'డాన్" తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన లారెన్స్ మళ్లీ ఈ సినిమాతో తిరిగి ఇక్కడ బిజీ కావాలని చూస్తున్నాడు.
ప్రభాస్ కి ఇప్పుడు ఫ్యామిలీస్, క్లాస్ ఆడియన్స్ లో పెరిగిన మైలేజ్ జత కలిస్తే అతని మాస్ సినిమా రేంజ్ బాగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే హ్యాట్రిక్ హిట్స్ తో ప్రభాస్ అమాంతం నంబర్ వన్ రేసులోకి దూసుకొచ్చేస్తాడు. కాగా రీసెంట్ గా తన 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాలు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉండేలా ద్వంద్వార్థాలకు శరీర ప్రదర్శనకు తావు లేకుండా సినిమాలను నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు. తన పెళ్లి మరో ఏడాదిన్నరలో ఉంటుందని హీరో ప్రభాస్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రేమ పెళ్లా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది అభిమానులకు పత్రికాముఖంగా తెలిపిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. మంచి కథ నిర్మాత లభిస్తే మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటిస్తానని స్పష్టం చేశారు. పౌరాణిక సినిమాల్లో నటించాలన్న తన కోరిక త్వరలోనే తీరబోతోందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











