రామ్ చరణ్‌‍కు అంత సీన్ ఉందా?

By Bojja Kumar

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమితాబ్ బచ్చన్ గతంలో నటించిన 'జంజీర్' రీమేక్‌‍లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్, బాలాజీ, ఈరోస్ సంస్థలతో కలిసి అమిత్ మెహ్రా ఈ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశారు కూడా.

అయితే రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో పెద్దగా అనుభవం లేని చెర్రీ...అమితాబ్ లాంటి పెద్ద స్టార్లు నటించిన పాత్రకు న్యాయం చేస్తాడా? చరణ్ ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలు. అందులో ఒక యావరేజ్, ఒకటి హిట్టు, మరొకటి ఫట్టు. ఈ నేపథ్యంలో జంజీర్ రీమేక్ ద్వారా చరణ్ ఎంట్రీ సర్వత్రా చర్చనీయాంశం అయింది.

1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాలో రామ్ చరణ్ నటించి సఫలమైతే ఎలాంటి సమస్యా ఉండుదు. పైగా చెర్రీ ఇమేజ్ అమాంతం పెరిగి పోతుంది. అదే ఒక వేళ ప్లాన్ వర్కౌట్ కాకపోతే? ఏమిటని అభిమానులు అందోళన చెందుతున్నారు. అందుకే చెర్రీ జాగత్తగా ఈ సినిమాను హ్యాండిల్ చేయడాలని కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X