రామ్ చరణ్,రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న ధీరుడు సినిమా బిజెనెస్ యాభై కోట్లు దాకా చేయవచ్చునని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హాలీవుడ్ రేంజిలో ఆ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడని అందులోనూ సినిమాల నుంచి విరమించిన చిరంజీవి ఓ పాటలో కనిపించి తనయుడుతో స్టెప్స్ వేయటం కిక్కిస్తాయింటున్నారు. ఇక ఈ ఊహ నిజమై కలెక్షన్స్ సంపాదిస్తే..పోకిరి రికార్డ్ లను బ్రద్దలు కొట్టడం చాలా ఈజి అంటున్నారు. అయితే అది అంత ఈజీ పనికాదని..అయితే జరగే అవకాశాలూ ఏం తక్కువ కాదనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ తెలుగులో హైయిస్ట్ పెయిడ్ హీరోగా ఎదగాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు. అదే జరిగేతే చిరంజీవి వారసత్వం నిలబెట్టినట్లువుతుంటున్నారు. బెస్టాఫ్ లక్ రామ్ చరణ్