శ్రీరామరాజ్యం...అన్నమయ్యను అధిగమిస్తుందా?
బాలయ్య శ్రీరామరాజ్యం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పాసిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన లవకుశ సినిమాకు ఈ సినిమా సీన్ టు సీన్ రీమేక్ అయినప్పటికీ...బాపు దర్శకత్వం, బాలయ్య లాంటి పెద్ద స్టార్ హీరో కావడంతో సాధారణంగానే సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సాధారణ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఈ కాలంలో పౌరాణిక సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండటంలేదు. అందుకే కలెక్షన్ల పరంగా తొలి రోజు సినిమాకు రూ. కోటి 60 లక్షలు దాటలేదు.
గతంలో నాగార్జున నటించిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు కూడా తొలుత సాధారణంగానే మొదలైనా....ఒకరి నోటి నుంచి ఒకరికి బాగుందనే టాక్ పాకడంతో ఆయా సినిమాల కలెక్షన్లు పుంచుకున్నాయి. మరి బాలయ్య శ్రీరామ రాజ్యం కూడా అదే తరహాలో ముందుకు సాగుతుందా? నాగార్జున అన్నమయ్య రికార్డులను బద్దలు కొడుతుందా? లేక మధ్యలోనే చతికిల పడుతుందా? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











