మహేష్ బాబు కూతురు సితార ఎలా బెదిరిస్తుందో చూశారా? స్టన్నవ్వాల్సిందే...
మహేష్ బాబు కూతురు సితార తన ముద్దు ముద్దు చేష్టలతో అభిమానులను ఆకట్టుకంటోంది. తాజాగా సితారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సితార తల్లి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు.
తనకు ఇష్టం లేని పని చేస్తుంటే సితార 'నో' అంటూ వారిని బెదిరించినంత పని చేస్తోంది. అందరూ తన మాటే వినాలంటూ ఆర్డర్లు వేస్తోంది. తన స్కూల్ టీచర్‌ను ఏమైనా అంటే వారిపై ఫైర్ అవుతోంది. ముద్దు ముద్దుగా సితార మాట్లాడే మాటలు, చేష్టలు చూస్తే మీరూ స్టన్నవ్వాల్సిందే.
సితార ఎంత ఎదిగిపోయిందో
సితారకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేసిన నమ్రత... తన కూతురు ముద్దు ముద్దు మాటలను, చేష్టలను చూసి మురిసిపోయింది. సితార అప్పుడే ఎంత ఎదిగిపోయిందో అంటూ ఆమె జ్ఞాపకాలను ఇలా అభిమానులతో పంచుకున్నారు.

స్నేహితులతో పార్టీ చేసుకున్న గౌతమ్
తన ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా గౌతమ్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నమ్రత అభిమానులతో పంచుకున్నారు.

గౌతమ్ మీద అభిమానం
భవిష్యత్తులో మహేష్ బాబు వారసత్వంతో గౌతమ్ సినిమాల్లోకి రాబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ‘1-నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ బాలనటుడిగా తరంగ్రేటం కూడా చేశాడు. నమ్రత ఈ ఫోటోస్ షేర్ చేయగానే అతడిపై తమ అభిమానం ప్రదర్శిస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్స్ పోస్టు చేశారు.

మహేష్ బాబు బిజీ బిజీ
మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగులో సూపర్ స్టార్ బిజీగా గడుపుతున్నారు. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











