నభూతో నభవిష్యత్, కళ్లు తిప్పుకోలేక పోతున్నా: మంచు మనోజ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఎన్టీఆర్' మూవీ సంబంధించిన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అచ్చం పెద్ద ఎన్టీఆర్ మాదిరిగా ఉన్న ఆ పోస్టర్లో బాలయ్య మేకోవర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. బాలయ్య ఆ పాత్రకు ఇంత బాగా సెట్టవుతారని ఎవరూ ఊహించలేదు.
తాజాగా ఈ పోస్టర్‌పై మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ స్పందించారు. 'నభూతో నభవిష్యత్. కళ్లు తిప్పకుండా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తోంది. ఇంత అద్భుతమైన పోస్టర్ ను వదిలిన నా డార్లింగ్ బ్రదర్ క్రిష్ కు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన పోస్టర్ నేను ఇప్పటి వరకు చూడలేదు అని మనోజ్ ట్వీట్ చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పాత్రలు ఈ చిత్రంలో కనిపించబోతున్నాయి.
ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .... ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు. భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నట్లు టాక్.

ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాలు చూపించబోతున్నారు. ఎన్టీఆర్ బాలయ్య, సినిమాల్లోకి ప్రవేశం, ఆ తర్వాత నటుడిగా ఎదిగిన వైనం, రాజకీయ ప్రభంజనం సృష్టించిన విధానం ఇలా పలు ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











