చిరు 150 సినిమా: బాలుడి అదృష్టమే అంటున్న ఫ్యాన్స్

By Bojja Kumar

హైదరాబాద్: చిరంజీవి అభిమానులంతా గత కొన్నేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆయన 150 సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చివరి సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్' విడుదలై ఏడేళ్లయింది. మధ్యలో రెండు మూడు సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడం మినహా ఆయన ఇప్పటి వరకు హీరోగా సినిమా చేయలేదు.

మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

 Cancer Kid in Chiru 150th Movie

తనను కలవాలని ఆశ పడుతున్న బాలు అనే క్యాన్సర్ బాధిత బాలుడిని గురువారం హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో కలిసిన చిరంజీవి.....150వ సినిమా ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని, ఇందులో బాలుకు కూడా నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ బాలుడు తన అభిమాన హీరో చిరును కలవడం మాత్రమే కాదు, చిరు 150వ సినిమాలో నటించడం ఆయన అదృష్టం అని అంటున్నారు. బాలుడి కోరిక తిరినందుకు మెగా ఫ్యాన్స్ సంతోషం వయక్తం చేస్తున్నారు.

చిరంజీవి 150వ సినిమాకు కథ, దర్శకుడు ఖరారు కాలేదు. ఆ రెండు ఒకే అయిన వెంటనే సినిమా ప్రారంభం కానుంది. చిరంజీవి 150వ చిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ చేపట్టనున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరిస్తారు. చిరంజీవి 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X