ఫేస్ బుక్ లో హాట్ టాపిక్: పవన్ వస్తారా..ప్రాణం నిలబెడతారా?
హైదరాబాద్ : ఫేస్ బుక్, ట్విట్టర్ లో నిన్న పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన ఓ న్యూస్ గురించే హాట్ టాపిక్ రన్ అవుతోంది. పవన్ కళ్యాణ్..వెళ్తారా..ప్రాణం నిలబెడతారా..ఏమన్నా డొనేషన్ ప్రకటించి ఆ చిన్నారిని ఆదుకుంటారా అనేది. కొందరు మాత్రం ఇలా డిస్కస్ చేసే బదులు మనకు చాతనైన సాయిం చేయచ్చు కదా అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటీ అంటే...
పవన్ ఫ్యాన్స్ అతి చిన్న వయస్సు నుంచి అతి పెద్ద వయస్సు వారు దాకా ఉన్నారు. ఆయనంటే వారికి ఎంత నమ్మకం,ఇష్టం అంటే.. భీమవరం కు చెందిన ఓ చిన్నారి పాప తన అభిమాన హీరో పవన్ ను చూడలని, తను చూస్తే, తనకు వచ్చిన జ్వరం తగ్గిపోతుందని చెపుతోంది. ఈ పాప ఎవరూ అంటే...
పశ్చిమగోదావరి, భీమవరం లోని పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల ఆరేళ్ల కుమార్తె నూకల కనకచంద్రదీపిక. నీరసంగా ఉండటంతో ఈ చిన్నారిని నెల రోజుల కిందట ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఈ పసిపాపకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో పాప తల్లితండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

అయితే ఆపాప కి కాన్సర్ అనే విషయం తెలియదు. పవన్ కళ్యాణ్ వీరాభిమామి అయిన ఆమె...పవన్ వస్తే అన్ని తగ్గిపోతాయంటోంది. ఆమె మాట్లడుతూ నాకు పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ అంకుల్ ఒక్కసారి నా దగ్గరకొస్తే నాకొచ్చిన జ్వరం త్వరగా తగ్గిపోతుంది అని అంది. ఇది విన్న వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తప్పక పవన్ అంకుల్ వస్తారని ఎదురు చూస్తున్నానంటోందీ చిన్నారి. చిన్నప్పటి నుంచి పవన్‌కల్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, వాళ్లు ఉండే చిన్న గది మొత్తం ఆయన పవన్ ఫొటోలతోనే నింపేసిందని తల్లిదండ్రులు చెప్తున్నారు.

ఇక ఈ కాన్సర్ వ్యాధి ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఈ చిన్నారి వైద్యానికి అవసరమయ్యే కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేయించేలా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్ హైపవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం.గోవిందరాజ్‌కుమార్ చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి చిన్నారి విషయం తీసుకెళ్లి త్వరలోనే వైద్యచికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉన్న ఇంటిని ఇప్పటికే వైద్యఖర్చుల నిమిత్తం తనఖా పెట్టారు. మరింత నగదు అవసరం కావడంతో దాతల సాయం కోసం చిన్నారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇదేమీ తెలియని ఆ పాప తనకేదో జ్వరం వచ్చిందని, పవన్‌కల్యాణ్ అంకుల్ వచ్చి చూస్తే తగ్గిపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











