కాన్స్ 2015: ఐశ్వర్యరాయ్ లుక్ కేక, సెల్ఫీలతో సందడి
హైదరాబాద్: ప్రపంచం నలుమూలల నుండి అందగత్తెల రాకతో కాన్స్ 2015 ఫిల్మ్ పెస్టివల్ తారాలోకాన్ని తలపిస్తోంది. వివిధ దేశాల నుండి అందాల సుందరాగులు కళ్లు మిరుమిట్లు గొలిపే సౌందర్యాన్ని విరజిమ్ముతూ కనువిందు చేస్తున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతం కావడంతో అందుకు సంబంధించిన ఫోటోలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐదవ రోజు....బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆకుపచ్చ వర్ణపు డ్రెస్సులో వెలిగిపోయింది. ఇక్కడ జరిగిన చారిమిటీ ఈవెంటులో ఐశ్వర్యరాయ్, సల్మా హయక్ తో కలిసి సందడి చేసారు. సాయంత్రం తన సహచర ఎల్ ఓరియల్ అంబాసిడర్ ఇవా లంగోరియాతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచారు.
ఐశ్వర్యరాయ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఇవా లంగోరియా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అప్ లోడ్ చేసింది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి....

ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆకుపచ్చ వర్ణపు డ్రెస్సులో వెలిగిపోయింది.

ఇవా లంగోరియాతో
ఐశ్వర్యరాయ్ సాయంత్రం తన సహచర ఎల్ ఓరియల్ అంబాసిడర్ ఇవా లంగోరియాతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచారు.

సెల్పీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ సెల్పీ ఫోటోలు తీసుకుంటూ సందడి చేసారు.

ఇవా
ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్ మీద నడుస్తుండగా సెల్ఫీ క్లిక్ మనిపించిన ఇవా లంగోరియా


Click it and Unblock the Notifications











