twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    లండన్ : ఎప్పటి నుండో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుకన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రానే వచ్చింది. 66వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ 'The Great Gatsby' అనే సినిమాతో ప్రారంభం అయింది. తొలి రోజు మన దేశం నుంచి బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్, మల్లికా షెరావత్, సోనమ్ కపూర్, ఫ్రిదా పింటో....రెండ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసారు.

    విద్యా బాలన్ ఈ సంవత్సరం తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌కు హాజరైంది. అంతే కాదు ఆమె ఇందులో జ్యూరీ మెంబర్ కూడా. విద్యా బాలన్ తో పాటు జూరీ మెంబర్లుగా హాలీవుడ్ స్టార్స్ నికోలస్ కిడ్మన్, అంగ్ లీ, క్రిస్టోఫ్ వాజ్, క్రిస్టిన్ ముంగూ, లైనేరామ్‌సే, నియోమి కవాసె, డేనియల్ ఉన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నేతృత్వం వహిస్తున్నారు.

    అమితాబ్ బచ్చన్ The Great Gatsby అనే హాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ ఈ చిత్ర నటులు లియోనార్డో డికాప్రియో, టోబే మంగురె తదితరులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్ ఐశ్వర్యరాయ్ మాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించలేదు.

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    తన హాలీవుడ్ మూవీ The Great Gatsby కోస్టార్లతో కలిసి అమితాబ్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    The Great Gatsby చిత్రం ద్వారా అమితాబ్ తొలిసారి హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ చిత్ర హీరో లియోనార్డో డికాప్రియోతో కలిసి అమితాబ్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    ఐశ్వర్యరాయ్ మాదిరి, ఫ్రిదా పింటో కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్. ఆమె ఇలా పింక్ కలర్ డ్రెస్‌లో సందడి చేసింది.

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    కాన్స్ ఫిల్మ్ పెస్టివల్ లో ఐశ్వర్యరాయ్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    సోనమ్ కపూర్ తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైనంది. ప్రత్యేకమైన భారతీయ దుస్తువులు, ముక్కు పుడక ధరించి అందరికీ ఆకట్టుకుంది.

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ అమితాబ్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాట్ అండ్ సెక్సీ లుక్ తో సోనమ్ కపూర్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    సంప్రదాయ దుస్తువుల్లో ఫ్యానబుల్‌గా కనిపించిన విద్యాబాలన్

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    తొలిసారిగా విద్యా బాలన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది.

     కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మనోళ్ల సందడి (ఫోటోలు)

    స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి విద్యాబాలన్

    English summary
    
 The much-awaited Cannes season has finally arrived. The 66th edition of the Cannes Film Festival 2013 opened with Baz Luhrmann's The Great Gatsby. As expected Bollywood stars like Amitabh Bachchan, Vidya Balan, Mallika Sherawat, Sonam Kapoor, Freida Pinto had graced the red carpet at the do.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X