నిన్న రాజమౌళి, ఇపుడు నాని... ఆ సినిమాపై పెరుగుతున్న అంచనాలు!

By Bojja Kumar

'C/O కంచరపాలెం'.... కొన్ని రోజులుగా ఈ మూవీ ఇండస్ట్రీలో సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి రాజమౌళి, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించడమే ఇందుకు కారణం. తాజాగా ఈ లిస్టులో హీరో నాని కూడా చేరిపోయాడు.

సినిమా చూసిన అనంతరం నాని ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ... 'కేరాఫ్ కంచరపాలెం ఒక మ్యాజిక్. ఈ సినిమా నన్ను నవ్వించింది, ఏడిపించింది. నా మనసును టచ్ చేసిన సినిమా ఇది. నా ఫేవరెట్ చిత్రాల లిస్టులో ఇది కూడా చేరిపోయింది. స్వచ్ఛమైన బంగారం లాంటి సినిమా. దయచేసి ఎవరూ దీన్ని మిస్ కావొద్దు అని నాని ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు, స్టార్ టెక్నీషియన్లు ఎవరూ లేరు. వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం ఇందులోని కంటెంటే అని ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి విడుదల చేస్తుందంటే... అందుకు కారణం కాన్సెప్టే నచ్చడం వల్లే అంటున్నారు రానా దగ్గుబాటి.

 Care Of Kancharapalem is MAGIC: Nani

విడుదల ముందే 'C/O కంచరపాలెం' పలు ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో తన సత్తా చాటింది. వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయగా, అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తోన్న విజయ ప్రవీణా పరుచూరి ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఎంపికైన నేపథ్యంలో ఆ చిత్ర బృందాన్ని రానా అభినందించారు. ఇలా ఒక మంచి చిత్రాన్ని విడుదల చేసే అవకాశం దక్కింనందుకు గర్వంగా ఉంది అని రానా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X