twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ: C/O కంచరపాలెంకు సెలెబ్రిటీలు ఫిదా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!

    |

    Recommended Video

    C/O Kancharapalem Twitter Review కేర్ ఆఫ్ కంచరపాలెం ట్విట్టర్ రివ్యూ

    ఆరడుగుల ఆజానుబాహుడు, టాలీవడ్ హంక్ మాన్ రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విశాఖ జిల్లాలోని కంచరపాలెం అనే గ్రామ నేపథ్యంలో నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే సెలెబ్రెటీలకు ప్రత్యేకమైన షోలు ప్రదర్శించారు. దీనితో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలెబ్రిటీలు, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

    వంశీ పైడిపల్లి

    కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాన్ని ప్రాణం పెట్టి చేశారు. పాత్రలన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయి. ఇంతటి కళాత్మక చిత్రాన్ని రూపిందించిన దర్శకుడు వెంకటేష్ మహాకు అభినందనలు. వెంకటేష్ రచన, దర్శత్వం అద్భుతం అంటూ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రశంసలు కురిపించాడు.

    ఆడియన్స్‌తో కలసి

    జైలవకుశ చిత్ర దర్శకుడు బాబీ కంచరపాలెం చిత్రం గురించి స్పందించాడు. ఈ చిత్రం గురించి అద్భుతమైన విషయాలు వింటున్నా. ఆడియన్స్ తో కలసి చూడాలనే ఉద్దేశంతో ముందుగా సినిమా చూడలేదు. యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహిస్తున్నందుకు అభినందనలు అని బాబీ తెలిపాడు.

    మాస్టర్ పీస్

    కంచరపాలెం చిత్రం ఒక మాస్టర్ పీస్. ఈ చిత్రం చూశాక నాకు మాటలు రావడం లేదు. దర్శకుడు మహా ఒక అద్భుతమైన చిత్రంతో అందరి హృదయాలు హత్తుకునేలా చేశారు అంటూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విటర్ లో స్పందించింది.

    చాలా అరుదుగా

    కంచరపాలెం చిత్రాలు కార్షియల్ గా విజయం సాధించడం చాలా అరుదు. కానీ ఈ చిత్రం అది నిరూపించబోతోంది అని హీరో సుమంత్ అభిప్రాయ పడ్డాడు.

    మంచు లక్ష్మి


    రానా ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. కంచరపాలెం చిత్రంలోని ప్రతి అంశం నాకు నచ్చింది. దర్శకుడు మహాకు ప్రత్యేక అభినందనలు. ఈ చిత్ర నిర్మాత ప్రవీణ కాష్ఠానికి వంద రెట్లు ఫలితం దక్కుతుంది అంటూ మంచు లక్ష్మి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసింది.

    సుశాంత్

    హీరో సుశాంత్ కంచరపాలెం చిత్రం గురించి స్పందిస్తూ.. స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఎమోషన్స్ చాలా బావున్నాయి. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు.

    బ్రిలియంట్

    కంచరపాలెం బ్రిలియంట్ మూవీ. సినిమా అద్భుతంగా ఉంది.

    క్లాసిక్ మూవీ

    కొద్దిసేపటి క్రితమే కంచరపాలెం ప్రీమియర్ షో యుఎస్ లో చూశా. ఇది ఒక క్లాసిక్ చిత్రం. అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడికి హ్యాట్సాఫ్.

    English summary
    CareOfKancharapalem movie twitter review. Rana Daggubati presenting this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X