»   » ‘బాహుబలి' పై అదిరిపోయే కార్టూన్ ఇదిగో (ఫొటో)

‘బాహుబలి' పై అదిరిపోయే కార్టూన్ ఇదిగో (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్ టాపిక్ ‘బాహుబలి'. ముఖ్యంగా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కావంటం అక్కడా రికార్డులు బ్రద్దలు కొట్టడం జరిగింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తాజా చిత్రం భాయి భజరింగి ని సైతం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపద్యంలో ఈ కార్టూన్ గీయటం జరిగింది. హిందీ కార్టూనిస్ట్ గీసిన ఈ కార్టూన్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. నిజంగా..ఖాన్ లు బాహుబలి దెబ్బకు భయపడ్డారా..అవుననే అంటోంది ఈ కార్టూన్ . ఈ కార్టూన్ ని సాంటా బాంట సైట్ వారు ట్వీట్ చేసారు. ఈ కార్టూన్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పాపులర్ అయ్యింది. ఆ కార్టూన్ ని మీరూ చూడండి...మరి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక సినిమాపై ప్రేక్షక లోకంతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్‌కు మనం ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తోంది.


తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.


Cartoon on Bollywood Hero's vs Baahubali

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.


ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.


మరో ప్రక్క


‘బాహుబలి' సినిమా రిలీజైతే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంతా ముందే ఊహించారు. ఎట్టకేలకు ఈ సినిమా సోమవారం(4వ రోజు).... 82 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రూ. 83 కోట్లతో టాపులో ఉండేది.


Cartoon on Bollywood Hero's vs Baahubali

బాహుబలి చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి ‘బాహుబలి' 200 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు వెర్షన్ 83 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యే వరకు వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2009కి ముందు మహేష్ బాబు నటించిన ‘పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డుగా ఉండేది.


2009లో వచ్చిన ‘మగధీర' చిత్రం 9 రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత ‘అత్తారింటికి దారేది' చిత్రం మగధీర రికార్డు బద్దలు కొట్టడానికి దాదాపు 25 రోజుల సమయం తీసుకుంది. తాజాగా బాహుబలి కేవలం 4 రోజుల్లోనే ‘అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.


English summary
Taking all things about Baahubali into consideration, a Bollywood media has now stunned with a cartoon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu