Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
దర్శకుడిగా కార్టూనిస్ట్ మల్లిక్..డిటేల్స్
వ్యంగ్య చిత్రాలతో కితకితలు పెట్టిన కార్టూనిస్ట్ మల్లిక్. ఇప్పుడాయన దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. దీనికి 'తొక్కలో ప్రేమ' అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రం పూర్తి స్దాయి కామెడీగా నడవనుంది.
''ఆద్యంతం నవ్వించే కథ ఇది. ప్రేమ పేరుతో యువత ఎలా పెడదారి పడుతుందో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాము''అన్నారు నిర్మాతలు. ప్రసాద్ చిలుకూరి, పట్టాభి నిర్మాతలు. మల్లిక్ దర్సకత్వం వహిస్తూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక హాస్య ప్రేమికులుకు మల్లిక్ సుపరిచితులే. ఆయన ప్రస్తుతం తెలుగు వన్ డాట్ కాం కి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయన రాసిన సీరియల్స్ పరుగో పరుగు,జీవితమే ఓ ఢమాల్ సినిమాలుగా వచ్చాయి. అలాగే ఆయన మని,సిసింద్రీ చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసారు.