twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిగా కార్టూనిస్ట్ మల్లిక్‌..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రస్తుతం వివిధ రంగాలనుంచి వస్తున్న క్రియేటివ్ పీపుల్ తమ అంతిల లక్ష్యంగా సినిమా దర్సకత్వం ఎంచుకుని,సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ అలా రచయితలు, కొరియోగ్రాఫర్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరక్టర్స్, లిరిక్ రైటర్స్, ఫిల్మ్ జర్నలిస్ట్ లు దర్శకుడులా మారారు. అయితే తాజాగా ఓ కార్టూనిస్ట్ దర్శకుడుగా మారుతున్నారు.

    వ్యంగ్య చిత్రాలతో కితకితలు పెట్టిన కార్టూనిస్ట్‌ మల్లిక్‌. ఇప్పుడాయన దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. దీనికి 'తొక్కలో ప్రేమ' అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రం పూర్తి స్దాయి కామెడీగా నడవనుంది.

    ''ఆద్యంతం నవ్వించే కథ ఇది. ప్రేమ పేరుతో యువత ఎలా పెడదారి పడుతుందో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాము''అన్నారు నిర్మాతలు. ప్రసాద్‌ చిలుకూరి, పట్టాభి నిర్మాతలు. మల్లిక్ దర్సకత్వం వహిస్తూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

    ఇక హాస్య ప్రేమికులుకు మల్లిక్ సుపరిచితులే. ఆయన ప్రస్తుతం తెలుగు వన్ డాట్ కాం కి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయన రాసిన సీరియల్స్ పరుగో పరుగు,జీవితమే ఓ ఢమాల్ సినిమాలుగా వచ్చాయి. అలాగే ఆయన మని,సిసింద్రీ చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసారు.

    English summary
    Mallik who is renowned as a cartoonist from the past Three and a half decades in various Telugu dailies is now turning a directors. Mallik is presently working as the Creative head in a film website. He is named the film directing as 'Tokkalo Prema'. Though the name looks very casual and simple, needs to see how he films it. There are a few films in recent times that came with variety names like this, but were filmed very beautifully on screen. Lets hope Mallik too does the similar. Also as Mallik is by profession a cartoonist, need to see the satires he throws on love now in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X