‘పికె’ చిత్రం నిలిపి వేయాలని సుప్రీం ఆదేశాలు?
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘పికె'పై పలు పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో ప్రత్యేకించి హిందూ దేవుళ్లనే టార్గెట్ చేసారని, హిందూదేవుళ్లపై సెటైర్లు వేసారంటూ ఆ చిత్ర దర్శకుడిపై కేసులు కేసులుపెట్టారు.
సినిమాలో కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు'' అనే డైలాగు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిల్‌ను దాఖలు చేసింది.

కాగా.... సినిమాపై తీర్పు తీసుకునేవరకూ పీకే చిత్రాన్ని ఇండియాలో ఎక్కడా ప్రదర్శించకూడదని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పిటిషన్‌ను కోర్టు మంగళవారానికి వాయిదా వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. హైదరాబాద్ లో అయితే టిక్కెట్స్ విక్రయిస్తున్నారు.
‘పికె' చిత్రం విషయానికొస్తే....అమీర్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వసూళ్లు 200 కోట్లకు చేరువయ్యాయి.


Click it and Unblock the Notifications











