దర్శకుడు తేజపై కేసు కొట్టివేసారు

By Srikanya

భూకబ్జా కేసులో దర్శకుడు తేజకు ఊరట లభించింది. తేజపై భూకబ్జా కేసుని నాంపల్లి కోర్టు కొట్టేసింది. తన ఇంటిని తేజ ఆక్రమించాడని చదలవాడ శ్రీనివాసరావు నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. తేజ తన ఇంటిని చదలవాడ శ్రీనివాసరావుకి అమ్మారు. అయితే ఒప్పందం ప్రకారం శ్రీనివాసరావు డబ్బు ఇవ్వలేదు. దాంతో తేజ తన ఇంటిని తను ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని తేజ కోర్టుకు తెలిపారు. కోర్టు అతనిపై కేసుని కొట్టివేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబరు.45లోని ఆస్తులను తాను ఆక్రమించానన్న ఆరోపణలను గతంలోనే రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్‌హెచ్‌ఆర్‌సి) ఎదుట తెలుగు సినీ దర్శకుడు తోసిపుచ్చారు. తన ఇంటిని తేజ బంధువులు ఆయన సహకారంతో బలవంతంగా ఆక్రమించినట్టు సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేసారు.

ఈ ఉదంతంలో... దర్శకుడు, నిర్మాత తేజపై చీటింగ్ కేసు నమోదైంది. ఆయన భార్య, మామ, బావమరిదిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుపై తేజ మామ ఫిర్యాదు చేశారు. దర్శకుడు తేజ తన కుమారుడి ఆపరేషన్ నిమిత్తం పీఆర్‌కే చౌదరి అనే ఫైనాన్షియర్ వద్ద రూ.90 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలం తర్వాత చౌదరి డబ్బు కోసం ఒత్తిడి తీసుకురావడంతో తేజ తన భార్య శ్రీవల్లి పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లోని తన ఇంటి దస్తావేజులను తనఖా కింద పెట్టి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు వద్ద రూ.3 కోట్లు తీసుకున్నారు.

శ్రీనివాసరావు పేరిట జీపీఏతోపాటు సేల్ డీడ్ కూడా చేశారు. చదలవాడ శ్రీనివాసరావు ఆ ఇంటిని తన కార్యాలయంగా మార్చుకున్నారు. దానికి రక్షణగా ఓ వాచ్‌మెన్‌ను నియమించుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి తేజ తన మామ అనంత పద్మనాభరెడ్డి, బావమరిది శ్రీవర్ధన్‌రెడ్డితో పాటు కొంత మంది గూండాలతో కలిసి వచ్చి వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటిని స్వాధీనం చేసుకున్నట్లు చదలవాడ శ్రీనివాసరావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అమ్మిన ఇంటిని తిరిగి కబ్జా చేసుకునేందుకు తేజ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు తేజతోపాటు ఆయన మామ, భార్య, బావమరిదిపై ఐపీసీ 420, 448, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

చదలవాడ శ్రీనివాసరావు వద్ద తాను రూ.3 కోట్లు అప్పుగా మాత్రమే తీసుకున్నానని... ఇల్లు అమ్ముతున్నట్టు చెప్పలేదని దర్శకుడు తేజ తెలిపారు. తనపై కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. "తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించాను. శ్రీనివాసరావు 6 రూపాయల వడ్డీ డిమాండ్ చేశారు. నేను 2రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పినా పట్టించుకోలేదు. కనీసం... మార్కెట్ ధర ప్రకారం రూ.9 కోట్లు ఇచ్చి ఇల్లు తీసుకోవాలని కోరాను. ఇందుకు కూడా శ్రీనివాసరావు అంగీకరించలేదు. నా ఇంటిపై దాడి చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు'' అని తేజ వివరించారు. ఈ కథ చివరకు ఇలా సుఖాంతమైంది.

ఇక నూతన తారలు ప్రిన్స్, నందిత జంటగా రూపొందిన 'నీకు నాకు డాష్ డాష్'కు తేజ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 13న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అప్పటికీ 'నీకు నాకు డాష్ డాష్' అంటే రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇందులో రక్తపాతం, బూతులు ఉండవు. 'డాష్' అనేది హీరోయిన్ ఊతపదం. ఇది లవ్‌స్టోరీ మేళవించిన థ్రిల్లర్. శుభంకార్డు పడే రెండు నిమిషాల ముందు కూడా ఓ మలుపు వస్తుంది. ఏమాత్రం ఊహించని ఆ మలుపుకు ప్రేక్షకులు థ్రిల్‌కు గురవుతారు వంటివి చెప్పినా జనం పట్టించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X