జీవిత రాజశేఖర్‌పై చీటింగ్ కేసు
ప్రస్తుతం జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న 'మహంకాళి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిర్మాత వై సురేందర్ రెడ్డి రూ. కోటికిపైగా ఫైనాన్స్ చేసారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన తన అనుమతి లేకుండా 'మహంకాళి' సినిమా హక్కులను మల్టీ డైమన్షియల్ ఎండీ రామ్మోహన్ రావుకు అమ్మారంటూ సుందర్ రెడ్డి జీవితపై కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు జీవిత రాజశేఖర్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపాలని ఆదేశించింది.
మహంకాళి చిత్ర విశేషాల్లోకి వెళితే...ఈ చిత్రంలో రాజశేఖర్..మహంకాళి అనే ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా చేస్తున్నారు. కధ విషయానికి వస్తే ..హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకి అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా దాని మూలాలు రాజధానిలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. అంటే మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్ని చర్చించే సినిమాయే 'మహంకాళి'.
ఓ హిందీ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట కార్తికేయ అనే దర్శకుడుతో ప్రారంభించారు. అయితే అనుకోని విధంగా సీన్ లో కి జీవిత ప్రవేశించి మెగాఫోన్ చేపట్టింది. ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, సలీమ్ పండా, ఆర్ కె, ఆషిష్ విద్యార్ధి, మురళీ శర్మ, సుప్రీత్, పిడి రాజు వంటి వారు నటిస్తున్నారు. పి.జి వింద కెమెరా అందిస్తుంటే చిన్న సంగీతం సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications












