ఖుష్చూ కేసు కొట్టేసారు
ఎప్పుడూ ఏదో వివాదంలో ఇరుక్కుంటూ ఉండే కుష్భూపై ఆ మధ్యన దేవత చిత్రపటాల పక్కన పాదరక్షలు ధరించి కూర్చున్నారంటూ కేసు దాఖలైంది. అయితే పలు వాదోపవాదాలు తర్వాత నటి ఖుష్బూ పై దాఖలైన ఈ కేసును పళని కోర్టు కొట్టివేసింది. లోగడ తమిళ చిత్రం 'వల్లమై తా రాయో' కార్యక్రమ వేదికపై లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవార్ల చిత్రపటాలను అవమానించారంటూ హిందూ సంఘాలు ఆరోపించాయి. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని ఆమె వివరణఇచ్చినా అవి శాంతించలేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ దిండుగల్ జిల్లా హెచ్‌ఎంకే సమన్వయకర్త శివకుమార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఖుష్భూ పాదరక్షల వివాదం కేసు చెన్నై కోర్టు ప్రభు సి సుందర్ khushboo dismissed court case goddess photos slippers prabhu c sundar


Click it and Unblock the Notifications