సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింతా బాడీ గార్డ్ లపై పోలీస్ కేసు
మహేష్ సరసన రాకుమారుడు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా చిత్రాలలో నటించిన ప్రీతిజింతా బాడీగార్డ్ లు పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. ముంబై పోలీసులు నిన్న హయిత్ ఖాన్ అనే టీనేజ్ కుర్రాడు ఇచ్చిన కంప్లైంట్ తో వీరిని అరెస్ట్ చేయటానికి పోలీసులు రెడీ అయ్యారు. ఆ కుర్రాడు తన కంప్లైంట్ లో...పొరపాటున యాక్సిడెంటల్ గా ప్రీతి జింతా కారను ముట్టుకోవటం జరిగింది. దానికే ఆమె బాడీ గార్డులు ఇద్దరు నాపై దాడి చేసి అక్కడనుంచి తోసేసి అవమానించారు అంటూ ఆవేదనగా రాసారు. బాడీగార్డులు తోయటం అనేది నిజమేనని, అయితే అది తమ హీరోయిన్ రక్షణలో భాగంగా జరిగిందే తప్ప వ్యక్తిగతంగా ఆ కుర్రాడు ఎవరో కూడా తమకి తెలియదని చెప్పారు. ఇక ప్రీతీజింతా ఈ విషయమై స్పందించటానికి ఇష్టపడలేదు. ఆ కుర్రాడు మాత్రం క్షణాపణతో సరిపోదని, తనను ఇబ్బందిపెట్టినందుకు అంతకుఅంతా వారు శిక్ష అనుభవించాల్సిందే అని పట్టుపడుతున్నాడు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











