twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కే.ఎస్.రామారావుపై 'చంద్రముఖి' కేసు

    By Staff
    |

    KS Rama Rao
    చంద్రముఖి సినిమా హిందీ నిర్మాణ హక్కుల వివాదంలో నిర్మాత, ఏపీ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్ష్యుడు కేఎస్ రామారావును వచ్చే నెల ఇరవై ఆరున కోర్టుకు హాజరవ్వాలని నాంపల్లి పదిహేడో అదనపు ఛీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఎం.రామకృష్ణ శుక్రవారం ఆదేశించారు. చంద్రముఖి సినిమా హిందీలో చేసే విషయంలో రామారావు తనను మోసం చేసారని దర్శకుడు నరేన్ ఆదిత్య 2006 లో కోర్టుకు పిర్యాదు చేసారు. ఈ కేసు విచారణ తుది దశలో ఉంది.

    చంద్రముఖి హిందీ సినిమాకు దర్శకత్వం వహించేలా తనతో ముందే ఒప్పిందం చేసుకుని మలయాళ చిత్ర సంస్ధ స్వర్ణచిత్ర బ్యానర్ నుంచి నిర్మాణ హక్కులను రామారావు పొందారని నరేన్ ఆదిత్య తెలిపారు. దర్శకత్వం వహించినందుకు తనకు పారితోషికంగా యాభై లక్షల రూపాయలను రోజుకు లక్షకు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. తాను దర్శకత్వ భాద్యతల్లో ఉండగానే నిర్మాణ హక్కులను తనకు తెలియకుండానే వేరే సంస్ధకు అమ్మేసి తనను మోసం చేశారని ఆదిత్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇక అప్పట్లో చంద్రముఖి హిందీ వెర్షన్ ని అమితాబ్,ఐశ్వర్యలతో నరేన్ ఆదిత్య తెరకెక్కించే ప్లాన్ చేసారు. కానీ ఈ చిత్రం హిందీ వెర్షన్ ని బూల్ బలయ్యా ని అక్షయ్ కుమార్, విద్యాబాలన్ కాంబినేషన్ లో ప్రియదర్శన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X