twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’ వివాదం... మోహన్ బాబుపై కేసుకి కోర్టు ఆదేశం

    By Srikanya
    |

    హైదరాబాద్: మోహన్ బాబు నిర్మించిన 'దేనికైనా రెడీ' చిత్రం కోర్టుదాకా వెళ్లింది. ఈ రోజు పోలీసులను హైదరాబాద్ మల్కాజ్ గిరీ కోర్టు మోహన్ బాబు,దర్శకుడు నాగేశ్వర రెడ్డి, విష్ణు, బ్రహ్మానందంలపై కేసుని ఫైల్ చేయాలని ఆదేశించింది. నెల్లూరులో మోహన్ బాబు.. బ్రాహ్మణ సంఘాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వారు మండిపడుతూ కోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఇంకా మోహన్ బాబు స్పందించలేదు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ఈ విషయమై కంప్లైంట్ చేయటం జరిగింది. అయినా వారు ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

    దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించేపరిచే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబు ఇంటి ముందు బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చిత్రం నిర్మాత, దర్శకులు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు బ్రాహ్మణ సంఘాల నేతలు ఫిలిం ఛాంబర్ జీఎంను కలిసి దేనికైనా రెడీ చిత్రంలోని అసభ్యకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు మీడియోతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు.

    ''బ్రాహ్మణులు నా ఇంటి ముందు ధర్నా చేశారా ! నాకు తెలీదు. ధర్నా చేశారంటే... వారు కిరాయి బ్రాహ్మణులు అయి ఉంటారు. చందాలకోసం ధర్నా చేసి ఉంటారు. నేను ఉంటే ఇచ్చి పంపేవాడిని'' అని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేదం చదివిన బ్రాహ్మణులు 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణులను కించపరిచామని అనుకోరని అన్నారు. ఓ వైపు సినిమాలో సన్నివేశాలు అవమానపరిచేలా ఉన్నాయని ఆందోళన జరుగుతుంటే ఆయన ఇలా మాట్లాడటం మరింత వివాదం పెంచేలా ఉన్నాయని అంటున్నారు.

    సినిమాలో చండీయాగం నిర్వహించే సన్నివేశంలో సినిమా పాటను పెట్టి యాగ విశిష్టతను కించపరిచారని, దీనికి మోహన్‌బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ సమితి అధ్యక్షుడు సుధాకర్‌శర్మ, యూత్ అధ్యక్షుడు రవికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత శర్మలు డిమాండ్ చేశారు. వారు మోహన్ బాబు ఇంటిముందు ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టుచేసి విడిచిపెట్టారు.

    English summary
    Malkajgiri court today asked the Hyderabad Police to file case against Mohan Babu, Nageswara Reddy, Vishnu and Brahmanandam for making objectionable remarks against a community. Several Brahmin organizations have been demanding that scenes which show Brahmins in bad light should be deleted immediately. Later talking to media in Nellore, Mohan Babu termed that those who came to his residence must be the one's who came for donations. This further irked the organizations and they approached the court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X