బిగ్‌బాస్ రియాల్టీ షో ఎఫెక్ట్: సల్మాన్ ఖాన్‌పై కేసు

ఆయనతో పాటు దర్శకుడు రజత్ రవాలీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయ నిపుణుల అబిప్రాయం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
మొహ్మద్ ఫసియుద్దీన్ అనే వ్యాపారవేత్త బిగ్‌బాస్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్‌ను అశ్రయించారు. ఒక వర్గంవారిని కించపరిచే విధంగా ఆ షో ఉందని ఆయన ఆరోపించారు.
తాను చేసిన ఫిర్యాదులో ఫసియుద్దీన్ సల్మాన్ ఖాన్, రజత్ రవాలీ పేర్లను పేర్కొన్నారు. చాలా పవిత్రమైన పదాలను వాడి ఒక వర్గంవారి మనోభావాలను ఆ షోలో కించపరిచారని ఆయన ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని ఫలక్‌నుమా పోలీసులను ఆదేశించింది.


Click it and Unblock the Notifications











