twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణవంశి 'శశిరేఖ'పై క్రిమినల్ కేసు

    By Staff
    |

    Sasirekha Parinayam
    జూబ్లిహిల్స్ పోలీసులు నిన్న 'శశిరేఖా పరిణయం' నిర్మాత సుంకర మధు మురళిపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసారు. జెమీన్ ల్యాబ్స్ మేనేజర్ ఎ.శ్రీనివాసరావు ఆ కేసు ఫైల్ చేసారు. శ్రీనివాస రావు చెప్పే దాని ప్రకారం కొద్ది వారాల క్రిందట శశిరేఖా పరిణయం నిర్మాత సుంకర మధు మురళి తనకు ఆ సినిమా 107 ప్రింట్స్ వేయమని ఇచ్చారు. అలాగే అవి డిసెంబర్ 31 న డబ్బు కట్టి పట్టుకెళతానన్నారు.చెప్పినట్లుగానే డిసెంబర్ 31 న మురళి ల్యాబ్ కి వచ్చి తన ప్రింట్స్ అడిగారు. అయితే డబ్బు ఇవ్వకపోవటంతో ల్యాబ్ వారు ప్రింట్స్ ఇవ్వటానికి నిరాకరించారు.

    అయితే సాయింత్రం కొంత మంది మనుషులును తీసుకొచ్చి డబ్బు చెల్లించకుండా బలవంతంగా ప్రింట్స్ తీసుకెళ్ళారు. తర్వాత చాలా సార్లు డబ్బు క్లియర్ చేయమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఈ కేసును విచారిస్తామన్నారు.ఇక తరుణ్,జెనీలియా జంటగా నిర్మించిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో నిర్మాత కూడా ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడుతున్నారని వినికిడి. సంవత్సరం ప్రారంభమే జెమినీ ల్యాబ్ లో ఈ సినిమా గురించి గొడవ అయ్యి రిలీజ్ లేటయిందన్న సంగతి తెలిసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X