రాంగోపాల్ వర్మ అరెస్ట్? పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో చేదు అనుభవం!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు ఏపీ సర్కార్ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద నమోదైంది. ఈ పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసిన ఆర్జీవి ఫ్యూచర్ ఏంటి? రాంగోపాల్ వర్మకి జైలు తప్పడా? అసలు ఏం జరగబోతుంది? అనే చర్చనీయంగా మారింది. వివరాల్లోకెళ్లే..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయారు. ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ రూపొందించిన గొప్ప దర్శకుడు గా గుర్తింపు పొందారు. కానీ, ఆ తర్వాత ఏమైంది? ఏమో? తెలియదు. కానీ, వరుసగా వివాదాలతో స్నేహం చేస్తూ.. వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా మారిపోయారు. మరి ముఖ్యంగా రక్త చరిత్ర తర్వాత.. ఆయన సినిమాల తీరు కూడా మారింది. రాజకీయ నాయకుల జీవిత చరిత్ర పేరిట తనకి ఇష్టం వచ్చిన కథలతో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలువురు నాయకుల జీవిత చరిత్రలను తనకు నచ్చిన విధంగా సినిమాలుగా తెరకెక్కించారు.

అంతటితో ఆగకుండా.. తెలుగు రాజకీయాలపై కూడా తనకు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ కు సపోర్ట్ గా ఉంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబును , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పలు సంచనల వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలిచారు. అదే సమయంతో వ్యంగంగా కామెంట్లు చేస్తూ ట్వీస్టులు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. శపథం, వ్యూహం అనే సినిమాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులను వ్యక్తిగతంగా అవమానించేలా రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు సపోర్ట్ గా ఉంటూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో రాంగోపాల్ వర్మ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. గతంలో జగన్ అండ చూసుకున్నచెలరేగిపోయారు.
అయితే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదయింది. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, నారా బ్రాహ్మణి పైన కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారనే ఆరోపణల ఆధారంగా పోలీసులు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటీ? వైసిపి ప్రభుత్వానికి మద్దతుతో చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిగతంగా దూషించారు. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదేపదే టార్గెట్ చేస్తూ.. అభ్యంతర వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











