సినీ నటుడు బాలకృష్ణ అనుచరుడు పూర్ణ చందర్ రావుతోపాటు మరికొంత మంది తన ప్లాట్ ను ఆక్రమించారని అజయ్ కుమార్ అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ పిరిధిలోని సర్వే నెంబర్ -62 లో స్ధానికుడైన విఠలయ్య వద్ద 1989లో అజయ్ కుమార్ 1073 గజాల స్ధలాన్ని కొనుగోలు చేసాడు. ఆ స్ధాలాన్ని సినీనటుడు బాలకృష్ణ అనుచరుడు పూర్ణ చందర్ రావుతో పాటు మరికొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీంతో అజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిపై 447,427,506 కేసులను నమోదు చేసారు. ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్సపెక్టర్ భుజంగరావు తెలిపారు.