న్యూడ్ పోస్టర్స్: అమీర్ ఖాన్‌పై కేసు నమోదు

By Bojja Kumar

ముంబై: అమీర్ ఖాన్ తాజా సినిమా 'పీకె' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్...న్యూడ్‌గా దర్శనమివ్వడం అందరినీ షాక్‌కు గురి చేసింది. జననాంగాలు కనిపించకుండా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకోవడం తప్ప అతని ఒంటిపై నూలు పోగు కూడా లేదు.

ఈ న్యూడ్ పోస్టర్లు ఇప్పటికే పేపర్లు, టీవీలు, ఇంటర్నెట్ ఇలా అన్ని విజువల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరిపోయింది. అయితే తాజాగా ఈ పోస్టర్ వివాదంలో చిక్కుకుంది. ఈ పోస్టర్ అసభ్యకరంగా ఉందని కేసు నమోదైంది. ఈ చిత్రం ప్రమోటర్లతో పాటు, హీరో అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, నిర్మాత విధువినోద్ చోప్రాలపై కేసు నమోదైంది.

'పికె' చిత్రం న్యూడ్ పోస్టర్ అసభ్యంగా ఉందని, సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా ఉందని న్యాయవాది మనోజ్ కుమార్ పిటీషన్ వేయడంతో సిటీ అడిషనల్ మెజిస్ట్రేట్ 7 కోర్టులో ఐపిసి 292 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ పోస్టర్లు చాలా అసభ్యంగా ఉన్నాయని, సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా ఉన్నాయని న్యాయవాది అన్నారు.

Case Filed Against Aamir Khan

వార్తా పత్రికల్లో ఈ పోస్టర్లు చూసి షాకయ్యాను. ప్రజలందరికీ ఈ పోస్టర్లు చేరి పోయాయి. చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ఇవి చేరి పోయాయి. ఇలాంటి దారుణమైన పోస్టర్లు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తాయిన ఆయన పేర్కొన్నారు.

'పికె' సినిమా వివరాల్లోకి వెళితే...
ఇక ఈ చిత్రం ముందునుకున్న తేది కంటే వారం రోజుల ముందే విడుదలకు సిద్దమవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X