»   » నాని హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

నాని హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు :నాని హీరోగా వచ్చిన జెండాపై కపిరాజు చిత్రంలో మెరిసిన కన్నడ భామ రాగిణి ద్వివేది గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమెపై ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదీ ఆమె డబ్బులు ఎగ్గొంటిందని. ఓ ప్రొడ్యూసర్ నుండి కొంత మొత్తాన్ని తీసుకొని తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేదిలేదని తెలిపింది. దీంతో ఆ ప్రొడ్యూసర్ ఈ అమ్మడితో పాటు ఆమె సోదరుడిపైన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టు తెలుస్తోంది

ప్రముఖ కన్నడ సినీనటి రాగిణి ద్వివేదిపై జేపీ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు.

Case Filed Against Actress Ragini Dwivedi

వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్‌ కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary
sandalwood actress Ragini Dwivedi and her brother Rudraksh, a costume designer, after Venkatesh, the producer of an upcoming Kannada movie Nati Koli, lodged a complaint against the two with the J.P. Nagar police alleging that they have not returned Rs 16 lakh he had given to them for costumes of a photo-shoot in connection with the film.
Please Wait while comments are loading...