అనుష్క, ప్రియమణిలపై అసభ్య వస్త్రధారణ కేసు!
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్స్ అనుష్క, ప్రియమణిలు తమ సినిమాల్లో హాట్ అండ్ సెక్సీగా అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో వారి వస్త్రధారణ అసభ్యంగా ఉందంటూ తాజాగా మల్కాజ్‌గిరి కోర్టులో ప్రవేట్ పిటీషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్త సుబద్ధి ఈ పిటీషన్ దాఖలు చేసారు.
సినిమాల్లో వీరి వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందని, ఒక రకంగా సమాజంలో మహిళలపై పురుషులు దాడులు చేయడాని పరోక్షంగా కారణం అవుతోందని పిటీషనర్ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాల్లో వస్త్రదారణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
సినిమాల్లో అసభ్య కరమైన సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డు వాటిని కత్తిరిస్తుంది. సన్నివేశాల తీవ్రతను బట్టి సంబంధిత వయసు వారు మాత్రమే చూడదగ్గ సినిమా రేటింగ్ జారీ చేస్తుంది. అనుష్క, ప్రియమణి మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్ల వస్త్రధారణ ఈ తరం సినిమాల్లో అసాధారణంగానే ఉంటోంది.
ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో? ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో అనే ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది. ఏది ఏమైనా అనుష్క, ప్రియమణి లాంటి టాప్ హీరోయిన్ల పేర్లు పిటీషనర్ ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అటు ప్రేక్షకుల్లోనూ ఈ అంశం గురించి చర్చమొదలైంది. అనుష్క, ప్రియమణి కలిసి నాగార్జున కథానాయకుడుగా రూపొందిన 'రగడ' సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











