బ్యాడ్ బాయ్స్... పూరి జగన్నాధ్‌పై కేసు నమోదు

మహేష్ బాబు-కాజల్ జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన 'బిజినెస్ మేన్' సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. తొలి రోజు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలోని బ్యాడ్ బాయ్స్ పాట....యువతను పెడదోవ పట్టించే విధంగా ఉందని, సాహిత్యం కూడా చెడు మార్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆడియో విడుదలై చాలా రోజులైంది. అప్పుడు చేయని ఫిర్యాదు, సినిమా విడుదలైన తర్వాత ఎందుకు చేశారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











