కుక్క తెచ్చిన తంట : వేణుమాధవ్‌పై ఇంటర్ విద్యార్థి కేసు
హైదరాబాద్ : తెలుగు సినిమా కమెడియన్ వేణుమాధవ్ పెంపుడు కుక్క వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో కృష్ణ అనే ఇంటర్ విద్యార్థి గాయపడ్డాడు. దీంతో సదరు బాధితుడు హైదరాబాద్‌లోని మౌలాలీ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. నాచారం పరిసర ప్రాంతంలో వేణుమాధవ్ నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.
ఆదివారం సాయంత్రం వేణుమాధవ్ కుక్కను వాకింగ్ నిమిత్తం బయటకు తీసుకెళ్లినప్పుడు అటు వెలుతున్న ఇంటర్ విద్యార్థిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వేణుమాధవ్‌కు హాయ్ చెప్పగా కుక్క అతనిపై దాడి చేసింది. అయితే గాయపడ్డ బాలున్ని వేణుమాధవ్ ఆసుపత్రికి తరలించక పోగా నానా మాటలు అన్నాడని కృష్ణ తల్లితండ్రులు ఆరోపించారు.
పెంపుడు కుక్కను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లనే ఇలా జరిగిందని తన ఫిర్యాలో పేర్కొంటూ...కుక్కతో పాటు, వేణుమాధవ్‌పై ఫిర్యాదు చేసారు. బాధితుడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే ఈ ఘటనపై వేణుమాధవ్ ఇంకా స్పందించలేదు. ఈ అంశాన్ని పెద్దది చేయడకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు వేణుమాధవ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












