అరవింద సమేత: పోలీసులు వేటమొదలు పెట్టారు, లీక్ చేసింది అతడే!
'గీత గోవిందం' సీన్లకంటే ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత' సీన్లు లీకైన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అంతకంటే ముందే సోషల్ మీడియాలో సీన్లు హల్ చల్ చేయడం నిర్మాతలను కలవరానికి గురి చేసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో అలర్టయిన హారిక అండ్ హాసిని అధినేత ఎస్ రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ విభాగం వేట మొదలు పెట్టారు.
Recommended Video


లీక్ చేసింది అతడే..
ఫిలింనగర్‌లోని డాటా డిజిటల్ బ్యాంక్‌లో పనిచేసే చక్రవర్తి అనే యువకుడు ‘అరవింద సమేత' మూవీలోని నిమిషాల నిడివి గల వీడియోను స్నేహితులకు షేర్ చేసినట్టు సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు.

ఎలా దొంగిలించాడు?
షూట్ చేసిన సన్నివేశాల వీడియోలను రోజూ హార్డ్ డిస్క్‌లో భద్రపరిచే బాధ్యతను ఫిలింనగర్‌లోని డాటా డిజిటల్ బ్యాంక్‌కు అప్పగించారు. ఇక్కడి నుండి చక్రవర్తి ఆ వీడియోను దొంగిలించడం, స్నేహితులకు షేర్ చేయడం...ఆపై వారు వీటిని వాట్సాప్, యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు.

వేట మొదలు పెట్టిన పోలీసులు
చక్రవర్తి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో అతడికి సంబంధించి వివరాలు సేకరిస్తూ గాలిస్తున్నారు. త్వరలోనే అతడు పట్టుబడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇష్యూ సీరియస్
గతంలోనూ పలు సినిమాల సీన్లు విడుదల ముందే లీకైనా... నిర్మాతలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే అరవింద సమేత, గీత గోవిందం లీకేజీల తర్వాత ఇష్యూ సీరియస్ అయింది. ఇలాంటి ఉపేక్షించితే చివరకు సినిమాలు లీకయ్యే వరకు వెళ్లడంతో ఇండస్ట్రీ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గీత గోవిందం ఇష్యూలో పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











