twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమ్లా నాయక్ సూపర్ హిట్.. చిక్కుల్లో పడ్డ పవన్ ఫ్యాన్స్.. ఎరక్క పోయి ఇరుక్కున్నారుగా!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చిక్కుల్లో పడ్డారు.. తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఇప్పుడు వారందరూ పోలీస్ కేసు సహా అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలేం జరిగింది? పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు చిక్కుల్లో పడ్డారు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

     అద్భుతమైన స్పందన

    అద్భుతమైన స్పందన

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రానా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రాణా సరసన సంయుక్త మీనన్ నటించగా సముద్రకని, రఘు బాబు, మురళి శర్మ, రావు రమేష్, పమ్మి సాయి లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

    చిత్తూరు జిల్లాలో

    చిత్తూరు జిల్లాలో


    ఈ సినిమా విడుదలైన మొదటి నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక కలెక్షన్లు కూడా గట్టిగానే రాబడుతోంది. అయితే తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతున్న కారణంగా సినిమా ధియేటర్లో మేకను బలి ఇచ్చారన్న కారణంగా ఇప్పుడు ఫాన్స్ చిక్కుల్లో పడిన పరిస్థితి కనిపిస్తోంది. చిత్తూరులోని పీలేరు, బోడుమల్లువారిపల్లె సీఎస్‌ఎన్‌ సినిమా థియేటర్‌లో మేకను బలి ఇచ్చారు.

    మేక బలి

    మేక బలి


    ఈ సంఘటనకు సంబందించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రజలు భయపడిపోతూ ఉన్న మేక ముందు నిలబడి ఫోటోలు మరియు వీడియోలకు పోజులివ్వడం కనిపిస్తోంది. పూర్తి స్పృహలో ఉన్న మేకను కత్తితో నరికి చంపడం, పూర్తిగా ప్రజల ముందు మేకను బలి ఇవ్వడం కూడా వీడియోలో రికార్డు చేయబడి ఉంది. బలి ఇచ్చిన మేక రక్తాన్ని ఓ వ్యక్తి తన ఒట్టి చేతులతో సేకరించి సినిమా పోస్టర్‌పై పూయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.

    అభినందనలు

    అభినందనలు


    ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జంతువులు మరియు పక్షుల బలి నిషేధ చట్టం 1950లోని సెక్షన్ 6, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 34 మరియు 429, 1860, ఆయుధాల చట్టం, 1959లోని సెక్షన్ 25 (1) (A) మరియు 11 (1) (ఎ) సెక్షన్‌ల కింద FIR నమోదు చేయబడింది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం (PCA) చట్టం, 1960 కేసు కూడా నమోదు చేశారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని సహించేది లేదనే సందేశాన్ని పంపేందుకు చిత్తూరు పోలీసులు చర్యలు తీసుకున్నందుకు PETA ఇండియా వారిని అభినందించింది.

    అక్కడ మాత్రమే

    అక్కడ మాత్రమే


    "పెటా ఇండియా ఎమర్జన్సీ టీం అసోసియేట్ మేనేజర్, మీట్ అషార్ ఇప్పుడు నరబలిని హత్యగా పరిగణిస్తున్నట్లుగా జంతుబలి యొక్క ప్రాచీన ఆచారం అంతం కావాలి అని అన్నారు. PETA ఇండియా తన ఫిర్యాదులో, ఆంధ్రప్రదేశ్ జంతువులు - పక్షుల బలి నిషేధ చట్టం, 1950లోని సెక్షన్ 5 (బి) స్పష్టంగా చెబుతోందని, ఏ వ్యక్తి అయినా తమ ఆధీనంలో ఉన్న జంతువును ఏ ప్రదేశంలోనైనా ఏ విధమైన బలిని ఉద్దేశపూర్వకంగా ఇవ్వకూడదు అని స్పష్టంగా పేర్కొంది. అధికారికంగా లైసెన్స్ పొందిన కబేళాలలో మాత్రమే జంతువులను వధించవచ్చని మరియు ఈ తీర్పును పురపాలక అధికారులు తప్పనిసరిగా పాటించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని కూడా పేర్కొంది.

    English summary
    case filed on Pawan Kalyan fans for celebrating Bheemla Nayak's success by sacrificing goat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X