»   » రాజమౌళి, బాహుబలి-2 నిర్మాతలపై కేసు నమోదు

రాజమౌళి, బాహుబలి-2 నిర్మాతలపై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' ప్రతి ఒక్కరినీ మెప్పిస్తూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ

ఒక మంచి సినిమా చూసామని ఆనందంగా ఇంటికి వెలుతంటే.... ఓ వర్గం మాత్రం సినిమా చూసి అసంతృప్తితో రగిలిపోతోంది.


ఆరెకటిక కమ్యూనిటీకి చెందిన వారు బాహుబలి-ది కంక్లూజన్ సినిమాలో తమ కమ్యూనిటీని కించపరిచే విధంగా సీన్లు, డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో దర్శకుడు రాజమౌళి, చిత్ర నిర్మాతలపై కేసు పెట్టారు.


మా మనోభావాలు దెబ్బతీసారు

మా మనోభావాలు దెబ్బతీసారు

దర్శకుడు రాజమౌళి, బాహుబలి నిర్మాతలు తమ కమ్యూనిటీని కించపరిచే విధంగా సినిమాలో చూపించారని, దీని వల్ల మా మనో భావాలు దెబ్బ తిన్నాయని ఆరెకటిక పోరాట సమితి ఆరోపిస్తోంది.


ఆసీన్లు తొలగించాలి

ఆసీన్లు తొలగించాలి

సినిమాలో ఓ సన్నివేశంలో కటికచీకటి అనే పదం ఉందని, వెంటనే దాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరెకటిక పోరాట సమితి ప్రెసిడెంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.


వార్నింగ్

వార్నింగ్

సినిమాలో నుండి ఆ సీన్ తొలగించక పోతే సినిమా థియేటర్ల వద్ద ప్రదర్శన జరుగకుండా ఆందోళన చేపడుతామని, రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.


బాహుబలి-2

బాహుబలి-2

బాహుబలి సినిమాకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.English summary
SS Rajamouli’s historic blockbuster, Baahubali The Conclusion, is being celebrated by every film lover across the country. But a group of people belonging to the Arekatika community are upset with the movie and have filed cases on the film’s director Rajamouli and the producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu