twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు నరేష్ పేరుతో ఘరానా మోసం.. చిక్కులు తెచ్చి పెట్టిన మాజీ భార్య '.. సంబంధమే లేదంటున్న నరేష్!

    |

    ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోసాలు దారుణంగా ఉంటున్నాయి. మోసపోతున్నట్టు బాధితులకు అర్ధం అయ్యే లోపే లక్షలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళతో పరిచయం ఉంది, వీళ్ళతో పరిచయం ఉంది మీకు పని చేయిస్తామని చెప్పి డబ్బు దండుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ పేరు కూడా అలాగే వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

     ఆ తరహాలోనే

    ఆ తరహాలోనే

    ఆ మధ్య శిల్పా చౌదరి అనే ఒక నిర్మాత టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి కోట్ల మేరకు వసూళ్లకు పాల్పడింది. చివరికి మహేష్ బాబు సోదరి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారంటే వాళ్ళను ఎలా బుట్టలో వేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా రమ్య రఘుపతి అనే మహిళ పలువురు మహిళల దగ్గర ఈ తరహా అక్రమ వసూళ్లకు పాల్పడింది.

    నరేష్ పేరు చెప్పి

    నరేష్ పేరు చెప్పి

    అయితే ఆమె 'మా' మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ పేరు ఈ మోసాలకు వాడుకుంది. అయితే సదరు రమ్య రఘుపతి అనే మహిళ మీద ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళల నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు విచారణ చేపట్టారు.

    ఫోటోలు చూపించి

    ఫోటోలు చూపించి

    ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన 'రమ్య రఘుపతి'ని 8 ఏళ్ల క్రితం నరేష్ వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. నరేష్‌ తో కలిసి ఉన్నప్పటి ఫోటోలు, ఆయ్నకు ఉన్న ఆస్తులను చూపించి.. ఈ ఆస్తి అంతా తనకే చెందుతుందని చెబుతూ చాలా మంది నుంచి ఆమె డబ్బులు చేసినట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు మరికొందరు మహిళల నుండి ఆమె లక్షల రూపాయలు వసూలు చేశారని సమాచారం. అలా వారి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట. ఏకంగా నరేష్ భార్యని అని చెబుతూ ఉండడంతో డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారులే అని అందరూ ఊరుకున్నారు.

    పోలీసులు రంగంలోకి

    పోలీసులు రంగంలోకి

    కానీ ఎన్ని రోజులు గడిచినా డబ్బు రాకపోవడంతో తిరిగి చెల్లించాలని ఎంత గట్టిగా అడిగినా.. రమ్య స్పందించడం లేదు. దీంతో మోసపోయామని తెలుసుకొని ఒక్కరొక్కరుగా పోలీసులను ఆశ్రయించారు. ముందు ఒకటి రెండు ఫిర్యాదులే కదా అని లైట్ తీసుకున్న పోలీసులు ఫిర్యాదులు ఎక్కువ కావడంతో రంగంలోకి దిగారు.

    Recommended Video

    Akkineni Nagarjuna Whistle Podu Moment At Bangarraju Musical Night Part 3 | Filmibeat Telugu
    నాకు సంబంధం లేదు

    నాకు సంబంధం లేదు

    రమ్య హైదరాబాద్ తో పాటు అనంతపురం, హిందూపురంలో కూడా పలువురి వద్ద నుండి నరేష్, కృష్ణ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశారని సమాచారం. ఇక తాజాగా ఈ విషయం మీద నటుడు నరేష్ స్పందించారు. రమ్య రఘుపతి పాల్పడిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే మరి ఈ విషయంలో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ మహిళను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Case filed on ramya raghupathi for allegedly collecting money on the name of naresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X