'కేస్ నెంబర్ 666/2013' రేపే రిలీజ్

By Srikanya

హైదరాబాద్ : మహాలక్ష్మి మూవీస్ పతాకంపై కె.అశోక్‌కుమార్ నిర్మించిన చిత్రం కేస్ నెంబర్ 666/2013. రేపు విడుదల అవుతున్న ఈ చిత్రం తొలి ఫౌండ్‌పుటేజ్ సినిమా కావటం విశేషం. ఈ చిత్రం వెంకట్ సిద్ధారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ దయ్యాలు లేవు అని నిరూపించడానికి ఓ ముగ్గురు కుర్రాళ్లు కెమెరాతో మారుమూల అడవికి వెళ్తారని, అక్కడ జరిగినవి వారి అనుభవంలోకి వచ్చినవి ఒక్కొక్కరుగా తమ అనుభవాలతో వివరిస్తారని, తొలిసారిగా ఫౌండ్‌పుటేజ్ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఒక్కొక్కరు మాయమవుతుంటే ఆ సంగతులన్నీ కెమెరాలలో రికార్డవుతాయని, ఆ మిస్టరీ ఏమిటనేదే చిత్ర కథాంశమని ఆయన తెలిపారు.

సినిమా బాగా వచ్చిందని, ఇది కొత్త తరహా చిత్రమని, దర్శకుడుకి మంచి భవిష్యత్ ఉంటుందని, ఈనెల 31న విడుదల చేయనున్నామని నిర్మాత అశోక్‌కుమార్ తెలిపారు.ఈ చిత్రానికి కెమెరా: చక్రధరరావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్, దర్శకత్వం: వెంకట్ సిద్ధారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X