మరోసారి పోలీస్ లకు చిక్కిన భువనేశ్వరి
చెన్నై : సినీ నటి భువనేశ్వరిపై మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సేలయూరుకు చెందిన కుమార్ తన కుటుంబంతో ఆదివారం రాత్రి ఈజంబాక్కంలోని ఓ థియేటర్‌కు వచ్చారు. నటి భువనేశ్వరి కూడా దామోదరకృష్ణన్ అనే వ్యక్తితో సినిమా చూసేందుకు చేరుకున్నారు. అక్కడ దామోదరకృష్ణన్‌కు, కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో మరికొందరు వచ్చి కుమార్‌పై దాడి చేశారు.
సమాచారం తెలియడంతో సంఘటన స్థలికి నీలాంగరై ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చేరుకున్నారు. ఆయనపైనా కొందరు దాడి చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు భువనేశ్వరితోపాటు మిగతావారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయమై తన తప్పేమీ లేదని భువనేశ్వరి అంటోంది. అయితే ఆమె మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.గతంలో కూడా భువనేశ్వరి వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే మరో సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని ఆమె ప్రకటించి సంచలనం రేపింది.
భువనేశ్వరి మొదట టీవి సీరియల్స్ నుండి 'బాయ్స్" చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత 'కుర్ కురే" చిత్రంలో దువ్వాసి మోహన్ తో జతకట్టింది. ఈ భారీ అందాల భామ భువనేశ్వరి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబెట్టింది. సినీమాలో తన కెరీర్ అంతబాగా రానీయక పోవడంతో ప్రొడ్యూసర్ గా మారబోతున్నాని చెప్పింది. ఆల్ రెడీ ఆమె రెండు టీవి సీరియల్స్ కి నిర్మాణ సారద్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య ఆమె ఫిలిం చాంబర్ లో తను కొత్తగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తన మొదటి చిత్రంగా 'పెళ్లామా పెళ్లాడదామా" అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించుకుందని సమాచారం.


Click it and Unblock the Notifications












