Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అతిగా తాగి హీరో ఆకాష్..మరో యువతి
హైదరాబాద్ : తాగి వాహనం కారు నడుపుతున్న ఇద్దరు సినీ హీరోలను శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. తెలుగు సినిమా హీరో ఆకాష్‌తో పాటు అతని స్నేహితుడైన వర్ధమాన నటుడు దినేష్ ఫిలింనగర్ సమీపంలో ఓ కార్యక్రమానికి హాజరై మద్యం సేవించారు.
రాత్రి 11.30కు వారు అపోలో హాస్పిటల్ వైపు నుంచి ఎమ్మెల్యే కాలనీ వైపు వెళుతుండగా కేబీఆర్ పార్కు సమీపంలో వారి కారును పోలీసులు అడ్డుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసుకొని, వారి ఫోర్డ్ ఐకాన్ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 15మంది వ్యక్తులు పట్టుబడగా శనివారం 13కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు.
దినేష్ అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డాడు. దినేష్‌తోపాటు కారులో సినీ హీరో ఆకాశ్, మరో యువతిని పోలీసులు అతిగా మద్యం సేవించిన స్థితిలో గుర్తించారు. అయితే వారు కారు నడపకపోవడంతో వదిలేశారు. సహాయ నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. జల్లు, అధినేత, వందేమాతరం తదితర సినిమాల్లో దినేష్ సహాయ నటుడిగా నటించారు. తనిఖీల్లో మొత్తం 14 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇక రీసెంట్ గా ఆకాష్ హీరోగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో నాగ సత్య పిక్చర్స్ సంస్థ నిర్మించే 'నాగమణి' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో ఆకాష్ మాట్లాడుతూ 'గతంలో వచ్చిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రం తరహాలో సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నాను' అని తెలిపారు. దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ 'నాగలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ నాగకన్య ఇక్కడ తన నాగమణిని పోగొట్టుకుంటుంది. దాని కోసం వెదుకుతున్నప్పుడు హీరో ఎదురవుతాడు. అక్కడి నుంచి ఆసక్తికరమైన మలుపులతో కథ కొనసాగుతుంది. చక్కని హాస్యంతో పాటు రొమాన్స్ కూడా చిత్రంలో ఉంది' అని చెప్పారు.