twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిగా తాగి హీరో ఆకాష్..మరో యువతి

    By Srikanya
    |

    హైదరాబాద్ : తాగి వాహనం కారు నడుపుతున్న ఇద్దరు సినీ హీరోలను శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. తెలుగు సినిమా హీరో ఆకాష్‌తో పాటు అతని స్నేహితుడైన వర్ధమాన నటుడు దినేష్‌ ఫిలింనగర్‌ సమీపంలో ఓ కార్యక్రమానికి హాజరై మద్యం సేవించారు.

    రాత్రి 11.30కు వారు అపోలో హాస్పిటల్‌ వైపు నుంచి ఎమ్మెల్యే కాలనీ వైపు వెళుతుండగా కేబీఆర్‌ పార్కు సమీపంలో వారి కారును పోలీసులు అడ్డుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసుకొని, వారి ఫోర్డ్‌ ఐకాన్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 15మంది వ్యక్తులు పట్టుబడగా శనివారం 13కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు.

    దినేష్‌ అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డాడు. దినేష్‌తోపాటు కారులో సినీ హీరో ఆకాశ్‌, మరో యువతిని పోలీసులు అతిగా మద్యం సేవించిన స్థితిలో గుర్తించారు. అయితే వారు కారు నడపకపోవడంతో వదిలేశారు. సహాయ నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేశారు. జల్లు, అధినేత, వందేమాతరం తదితర సినిమాల్లో దినేష్‌ సహాయ నటుడిగా నటించారు. తనిఖీల్లో మొత్తం 14 వాహనాలను సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

    ఇక రీసెంట్ గా ఆకాష్ హీరోగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో నాగ సత్య పిక్చర్స్ సంస్థ నిర్మించే 'నాగమణి' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో ఆకాష్ మాట్లాడుతూ 'గతంలో వచ్చిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రం తరహాలో సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నాను' అని తెలిపారు. దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ 'నాగలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ నాగకన్య ఇక్కడ తన నాగమణిని పోగొట్టుకుంటుంది. దాని కోసం వెదుకుతున్నప్పుడు హీరో ఎదురవుతాడు. అక్కడి నుంచి ఆసక్తికరమైన మలుపులతో కథ కొనసాగుతుంది. చక్కని హాస్యంతో పాటు రొమాన్స్ కూడా చిత్రంలో ఉంది' అని చెప్పారు.

    English summary
    
 Tollywood Hero Aakash and Dinesh was caught for Drunk and Drive Case last night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X